దాల్ సూప్
  • 450 Views

దాల్ సూప్

కావలసినవి:

  • పెసరపప్పు - 2 స్పూన్లు
  • టొమాటో ముక్కలు - పావు కప్పు
  • ఉల్లితరుగు - పావు కప్పు
  • వెల్లుల్లి పేస్ట్ - అర స్పూను
  • కొత్తిమీర - కొద్దిగా, నిమ్మరసం - స్పూను
  • నూనె - కొద్దిగా, ఉప్పు - తగినంత
  • జీలకర్ర - అర స్పూను

విధానం:

బాణలిలో నూనె కాగిన తరవాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తరవాత వెల్లుల్లి పేస్ట్ వేసి మరోమారు వేయించాలి. అందులో కడిగి ఉంచుకున్న పెసరపప్పు వేసి దోరగా వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు, నీళ్లు పోసి పప్పు మెత్తబడేదాకా ఉడికించి, మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. చివరగా అన్నిటినీ కలిపి మరోమారు వేడిచేసి కొత్తిమీర, నిమ్మరసం, జీలకర్ర వేసి బౌల్‌లోకి తీసుకోవాలి. దాల్ సూప్