డేట్స్ అండ్ హనీ బాల్స్
  • 117 Views

డేట్స్ అండ్ హనీ బాల్స్

కావలసినవి:

  • ఖర్జూరాలు - కప్పు
  • వేరుశనగపప్పు - అర కప్పు
  • (వేయించినవి)
  • నువ్వులు - అర కప్పు (వేయించినవి)
  • ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు
  • కొబ్బరి పొడి - పావు కప్పు
  • తేనె - మిశ్రమాన్ని బాల్స్ చేయడానికి తగినంత

విధానం:

వేరుశనగపప్పు, కొబ్బరి తురుము, నువ్వులను కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి(పొడి కాకూడదు, పలుకుగా ఉండాలి). అందులో ఖర్జూరం ముక్కలు వేసి మరొకసారి తిప్పాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో తేనె కలిపి లడ్డూలుగా చేయాలి. ఈ లడ్డూలను కొబ్బరి పొడిలో అద్దాలి. లడ్డూకు అన్నివైపులా కొబ్బరి పొడి పట్టేటట్లు చూడాలి. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం.