కాన్‌పురా చికెన్
  • 283 Views

కాన్‌పురా చికెన్

కావలసినవి:

  • బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా.
  • తెల్ల మిరియాలపొడి - తగినంత
  • ఉప్పు - రుచికి తగినంత
  • మైదా - 2 టీ స్పూన్లు
  • గుడ్డు - 1

విధానం:

చికెన్‌కు మిరియాలపొడి కలిపి అరగంట నాననివ్వాలి. దీనికి కొద్దిగా ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మరో పాత్రలో గుడ్డులోని తెల్లసొన, మైదా, ఉప్పు కలిపి ఉంచాలి. కడాయిలో నూనె కాగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చికెన్‌ను పొడవు పీసులుగా చేత్తో చేసి, గుడ్డు మిశ్రమంలో ముంచి, కాగిన నూనెలో వేసి వేయించాలి. వీటిని గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మముక్కలతో అలంకరించాలి. టొమాటో లేదా సోయా సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.