వరలక్ష్మి దేవి పులిహోర
 • 331 Views

వరలక్ష్మి దేవి పులిహోర

కావలసినవి:

 • బియ్యం - గ్లాసు
 • చింతపండు - 150 గ్రా.
 • ఉప్పు - తగినంత
 • ఎండుమిరపకాయలు - నాలుగు
 • పచ్చిమిర్చి - 2 (నిలువుగా చీరాలి)
 • ఆవాలు - అర టీ స్పూన్
 • శనగపప్పు - టీ స్పూన్
 • మినపప్పు - టీ స్పూన్
 • పల్లీలు - టేబుల్‌స్పూన్
 • జీలకర్రపొడి - టీ స్పూన్
 • జీడిపప్పు - 10 పలుకులు
 • పసుపు - తగినంత
 • ఇంగువ - చిటికెడు

విధానం:

ముందుగా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ఉంచాలి. అన్నం వండి, పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి, పల్లీలు, జీడిపప్పు, ఆవాలు, శగనపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కొంచెం ఇంగువ వేసి వే యించాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి పది నిమిషాలు ఉడికించాలి. ఒక బేసిన్‌లో అన్నం విడదీసి, కొద్దిగా పసుపు, నూనె వేసి కలిపాలి. అందులో ఉడికించిన చింతపండు గుజ్జు, జీలకర్రపొడి వేసి అన్నానికంతా పట్టేలా కలపాలి.