దోసకాయ దోసె
  • 522 Views

దోసకాయ దోసె

కావలసినవి:

  • దోసకాయ తురుము - 2 కప్పులు,
  • మెంతులు - చిటికెడు,
  • అటుకులు - అర కప్పు.,
  •  బియ్యం - అర కప్పు,
  •  ఉప్పు - సరిపడా,
  • నూనె - తగినంత

విధానం:

బియ్యం, మెంతులు, అటుకులు విడివిడిగా రెండు గంటలు నానబెట్టాలి. వీటన్నింటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. అందులోనే దోసకాయ తురుము వేసి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో ఉప్పు కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయం దోసెలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.