డ్రైఫ్రూట్స్ రైస్
  • 163 Views

డ్రైఫ్రూట్స్ రైస్

కావలసినవి:

  • ఒకటిన్నర కప్పులు;
  • బటర్ : 3 టేబుల్ స్పూన్లు;
  • ఉల్లి తరుగు : అర కప్పు;
  • జీలకర్ర : అరటీ స్పూను;
  • పసుపు : అర టీ స్పూను;
  • దాల్చినచెక్క పొడి : పావు టీస్పూను;
  • వెల్లుల్లి రేకలు : 2;
  • నీళ్లు : రెండుంపావు కప్పులు;
  • ఉప్పు : తగినంత;
  • మిరియాల పొడి : పావు టీ స్పూను;
  • డ్రై ఫ్రూట్స్ : కప్పు (బాదం పప్పులు,
  • జీడిపప్పులు, కిస్‌మిస్, పిస్తా పప్పులు,
  • ఆప్రికాట్... వంటివి)

విధానం:

బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు పావు గంట సేపు నానబెట్టి, నీళ్లు వంపేసి, తడి పోయేవరకు సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి  బాణలిలో బటర్ వేసి కాగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి
 బియ్యం జత చేసి, కలియబెట్టాలి   నీళ్లలో ఉప్పు వేసి మరిగించి ఇందులో పోసి, మంట తగ్గించి, మూత ఉంచి, సుమారు పది నిమిషాలు ఉడికించాలి మరొక బాణలిలో బటర్ వేసి కరిగించి, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, దాల్చిన చెక్క పొడి, పసుపు, మిరియాల పొడి వేసి వేయించి, ఉడుకుతున్న అన్నంలో వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి  బాణలిలో నెయ్యి వేసి కరిగాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించి, అన్నంలో వేసి కలిపి వేడివేడిగా వడ్డించాలి.