దమ్‌ ఆలూ మసాలా
 • 489 Views

దమ్‌ ఆలూ మసాలా

కావలసినవి:

 • చిన్న బంగాళదుంపలు - అర కిలో (గుండ్రటివి)
 • ఉల్లిపాయలు - పావు కిలో,
 • అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 50 గ్రాములు
 • ఉప్పు - తగినంత,
 • పసుపు - చిటికెడు, Telugu Vantallu
 • నూనె - వేయించడానికి సరిపడా
 • గరం మసాలా - పావు టీ స్పూన్‌,
 • ధనియాల పొడి - పావు టీ స్పూన్‌
 • జీలకర్ర పొడి - అర టీ స్పూన్‌,
 • కారం - అర టీ స్పూన్‌

విధానం:

బంగాళదుంపలు చెక్కు తియ్యాలి. వాటిని చాకుతో చిల్లులు పొడిచి నూనెలో ఎర్రగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా గ్రైండ్‌ చెయ్యాలి. బాండీలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కల పేస్ట్‌, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాల పొడి వేసి కాసేపు వేయించాలి. తర్వాత వేయించిన బంగాళ దుంపలు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అందులోనే కొద్దిగా నీళ్లు, ఉప్పు కలిపి సన్న మంట మీద ఉడికించాలి. దించే ముందు గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కలపాలి. ఇష్టమైన వాళ్లు నిమ్మరసం కూడా పిండుకోవచ్చు.దమ్‌ ఆలూ మసాలా