ముందుగా పొయ్యి మీద బాణలి పెట్టి కొబ్బరి, గసగసాలు, ఉల్లిపాయ ముక్కలు వేయించి ఆ తరువాత మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కడిగిన కీమాలో కలపాలి. దీనికి మిగిలిన పదార్థాలను కూడా చేర్చి సరిపడా నీరు పోసి కుక్కరులో పదిహేను నిమిషాలు ఉడికించాలి. మూత తీసి మళ్ళీ పొయ్యిమీద పెట్టాలి. మంట తగ్గించి కీమా దగ్గరపడి మాడు వాసన వచ్చేంత వరకు వేయించాలి. దమ్కీమా ను కొత్తిమీర పుదీనా, ఉల్లిపాయ ముక్కలతో కలిపి వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.