బాండీలో కొబ్బరి, గసగసాలు, ఉల్లిపాయ ముక్కలు వేయించి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని కడిగిన కీమాలో కలపాలి. ఇందులోనే మిగిలిన పదార్థాలను కూడా చేర్చి సరిపడా నీళ్లు పోసి కుక్కరులో పావుగంట ఉడికించాలి. ఆవిరి పోయాక మూత తీసి మంట తగ్గించి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేవరకు వేయించాలి. చివర్లో కొత్తిమీర, పుదీనా తరుగు కలిపితే చాలు. కీమా సిద్ధమైనట్లే.