ఎగ్ బజ్జీ
  • 508 Views

ఎగ్ బజ్జీ

కావలసినవి:

  • కోడిగుడ్లు - 3,
  • ఓట్స్- ఒకటిన్నర కప్పు,
  • ఉప్పు - రుచికి తగినంత,
  • మిరియాల పొడి - అర టీ స్పూన్,
  • కోడిగుడ్టు- 1 ఉడకబెట్టనిది,
  • నూనె- వేయించడానికి తగినంత,
  •  చాట్‌మసాలా- టీ స్పూన్,
  • నిమ్మరసం- టీ స్పూన్.

విధానం:

ఒక పాత్రలో ఓట్స్, గుడ్డు సొన, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి. ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమమంతా బాగా పట్టేలా తిప్పాలి. స్టౌపై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి. ఆ గుడ్డును నూనెలో వేసి ఓట్స్ మిశ్రమం గోధుమరంగులోకి మారేంతవరకు వేయించాలి. ఆ గుడ్డును కత్తితో మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్‌చేసి ప్లేట్‌లో సర్ది తినాలి.