ఎగ్ బిర్యానీ
  • 310 Views

ఎగ్ బిర్యానీ

కావలసినవి:

  • కోడిగ్రుడ్లు: 7,
  • కొత్తిమీర,
  • పుదీనా తురుము: అరకప్పు,
  • పచ్చిమిర్చి: ఏడు,
  • పెరుగు: ఒక కప్పు,
  • ఆయిల్: మూడు టేబుల్ స్పూన్లు,
  • అల్లం,
  • వెల్లుల్లి పేస్ట్: మూడు టేబుల్ స్పూన్లు.
  • కుంకుమపువ్వు: అర టేబుల్ స్పూన్.
  • కారం,
  • ఉప్పు: సరిపడా,
  • నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్.

బిర్యానీ రైస్‌కు కావలసిన పదార్థాలు:

  • బాస్మతి బియ్యం: నాలుగు కప్పులు,
  • ఆయిల్: ఒక టేబుల్ స్పూన్,
  • బిర్యానీ ఆకులు: మూడు,
  • లవంగాలు, యాలకులు: ఐదు,
  • ఉప్పు, నీరు: సరిపడా.


ముందుగా కోడిగ్రుడ్లను ఉడికించి నిలువగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కుంకుమ పువ్వును గోరువెచ్చని పాలలో నానబెట్టుకోవాలి. ఇంకా బిర్యానీకి మసాలా ఎలా తయారు చేసుకోవాలంటే..? లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, మిరియాలను పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

విధానం:

బాస్మతి బియ్యంలో సరిపడా నీటిని పోసి, అందులో ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు, పుదినా, కాసింత ఉప్పు వేసి వండుకోవాలి. తర్వాత ఉడికించిన అన్నాన్ని వెడల్పాటి పాత్రలోకి తీసుకుని చల్లార్చాలి.
తర్వాత ఓ పాత్రలో నెయ్యి వేసి వేడయ్యాక ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగాక, పచ్చిమిర్చి అల్లం, వెల్లుల్లి ముద్ద ఒకదాని తరువాత ఒకటి వేసి 2 నిమిషాలు వేపాలి. తర్వాత కారం, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమంలో టమోటా, కోడిగ్రుడ్లు వేసి మసాలా కలిసేలా వేపుకోవాలి. ఇందులో పెరుగు, నిమ్మరసం వేసి ఏడు నిమిషాల పాటు వేపి స్టౌ మీద నుంచి దింపి పక్కనబెట్టుకోవాలి.
అనంతరం ఒక వెడల్పాటి పాత్రను తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసి ఉడికించుకున్న అన్నాన్ని వేయాలి.
రైస్ మీద కోడిగుడ్డుతో చేసిన మసాలా వేసి స్ర్పెడ్ చేయాలి. ఆపై నెయ్యి, పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు చిలకరించి, కొత్తిమీర చల్లి మూత పెట్టి పదినిమిషాల పాటు ఉడికించి దింపేయాలి. అంతే ఎగ్ బిర్యానీ రెడీ..!. ఈ బిర్యానీని మీకు ఇష్టమైన చికెన్ కర్రీ లేదా బ్రింజాల్ కర్రీతో వేడి వేడిగా సర్వ్ చేయొచ్చు.