ఎగ్‌ చట్నీ
  • 786 Views

ఎగ్‌ చట్నీ

కావలసినవి:

  • కోడిగుడ్లు-డజను,
  • కారం-పావు కేజీ,
  • ఉప్పు-200 గ్రా,
  • పసుపు-రెంచు చెంచాలు,
  • మెంతులు, జీలకర్ర-చెంచా చొప్పున,
  • ఎండు మిర్చి-ఆరేడు,
  • చింతపండు-పావు కేజీ,
  • నూనె-పావు కేజీ,
  • వెల్లుల్లి రెబ్బలు-కొన్ని

విధానం:

మెంతుల్ని వేయించి పొడి చేసుకోవాలి. కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి నూనెలో వేయించి పెట్టుకోవాలి. ఓ పాత్రలో కారం, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు, మెంతి పిండి, నూనె తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి మరోసారి కలపాలి. మిగిలిన నూనె వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్రతో తాలింపు పెట్టి పచ్చడిపై వేసి బాగా కలపాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు అలంకరిస్తే చాలు.. నిల్వ ఉండే కమ్మని కోడిగుడ్డు పచ్చడి సిద్ధం.