ప్యాన్లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత ఉడికించి పొట్టు తీసిన కోడిగుడ్డు వేసి కలపాలి. ఒక గిన్నెలో జీలకర్ర పొడి, మెంతి పొడి, నువ్వుల పొడి, చింతపండు పులుసు, ధనియాల పొడి, అర కప్పు నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలిపి ఉల్లిపాయలో వేయాలి. తగినంత ఉప్పు కలిపి మూత పెట్టి ఉడికించాలి. మొత్తం ఉడికిన తర్వాత దింపేయాలి. ఈ కూర పలావ్, బిర్యానీకి బావుంటుంది.