ఎగ్ కోఫ్తా
  • 304 Views

ఎగ్ కోఫ్తా

కావలసినవి:

  • కోడిగుడ్లు - 3 (ఉడికించి, పొట్టు తీసినవి)
  • మటన్ ఖీమా - 150 గ్రా.లు;
  • పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూన్;
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
  • ఎండుకారం - టీ స్పూన్;
  • ఉప్పు - రుచికి త గినంత
  • ధనియాలపొడి - అర టీ స్పూన్;
  • శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు;
  • గరం మసాలా - చిటికెడు;
  • నిమ
  • ్మరసం - టీ స్పూన్; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్;
  • నూనె - వేయించడానికి తగినంత

విధానం:

ఒక పాత్రలో మటన్ ఖీమా, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుకారం, ఉప్పు, ధనియాలపొడి, శనగపిండి, గరంమసాలా, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమంతా బాగా పట్టేలా తిప్పాలి. స్టౌ పై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి. తర్వాత ఆ గుడ్డును తీసి నూనెలో వేసి ఖీమా మిశ్రమం గోధుమరంగులోకి మారేంతవరకు అటూ ఇటూ తిప్పి వేయించాలి. బయటకు తీసి బ్లాటింగ్ పేపర్‌మీద పెట్టాలి. గుడ్డుకు అంటుకొని ఉన్న అదనపు నూనె పేపర్ పీల్చుకున్నాక ఆ గుడ్డును గుండ్రని ముక్కలుగా కట్‌చేసి ప్లేట్‌లో సర్ది వేడి వేడిగా అందించాలి.