ఎగ్‌ నూడుల్స్
 • 500 Views

ఎగ్‌ నూడుల్స్

కావలసినవి:

 • నూడుల్స్‌: 500 గ్రా
 • గుడ్లు: 2
 • కాబేజీ: 1/2 కప్పు (తరిగినది)
 • క్యారెట్‌: 1/2 కప్పు (తరిగినది)
 • కాప్సికమ్‌: 1/2 కప్పు (తరిగినది)
 • మష్రూమ్స్‌: 1/2 కప్పు (తరిగినది)
 • ఉల్లికాడలు: 1/2 కప్పు (తరిగినది)
 • అల్లం: 1 స్పూన్‌ (పేస్ట్‌)
 • వెల్లుల్లి: 1 స్పూన్‌ (పేస్ట్‌)
 • మిరపకాయ: 1
 • మిరియాల పొడి: 1 స్పూన్‌
 • కారం: 1 స్పూన్‌
 • చిల్లీ సాస్‌: 1 స్పూన్‌
 • సోయా సాస్‌: 1/2 స్పూన్‌
 • నూనె: 2 స్పూన్లు
 • ఉప్పు: తగినంత

విధానం:

పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నీళ్ళు పోసి, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు నూడుల్స్‌ అందులో వేసి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించాలి. అవి మృదువుగా అయిన తర్వాత బయట కు తీసి ఒక చిల్లుల బుట్టలో వేసి నీరంతా బయటకు పోయేలా చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక బాణలి తీసుకొని అందులో కాస్త నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ అందులో వేయాలి. తర్వాత క్యారెట్‌ తురుము, క్యాబే జి, కాప్సికమ్‌, మష్రూమ్స్‌ అన్నీ వేసి దోరగా వేగనివ్వాలి.

తర్వాత అందులో వండిన నూడుల్స్‌ వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు అందులో సోయా సాస్‌, చిల్లీ సాస్‌ వేసి బాగా కలిపి మరొక నిమిషం లేదా రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.ఒక బౌల్‌ తీసుకుని అందులో గుడ్లు కొట్టుకోవాలి. బాణలి తీసుకొని అందులో కొంచెం నూనె వేసి ఈ గుడ్లను అందులో వేయాలి. గుడ్ల సొన ఉండచుట్టుకోకుండా బాగా కలపాలి. తర్వాత అందులో ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీనిని నూడుల్స్‌లో కలిపి సర్వ్‌ చేయడమే. గుడ్లు ఇష్టం లేని వారికి ఈ పొరటును కలపకుండా సర్వ్‌ చేయవచ్చు