ఎగ్ పుడ్డింగ్
  • 570 Views

ఎగ్ పుడ్డింగ్

కావలసినవి:

  • గుడ్లు - 6,
  • పంచదార - 6 టీ స్పూన్లు
  • ఏలకుల పొడి - టీ స్పూన్
  • చిక్కనిపాలు - గ్లాసు

విధానం:

గిన్నెలో గుడ్లలోని సొన వేసి బాగా గిలకొట్టాలి.  దీంట్లో పంచదార, ఏలకుల పొడి మరియు  పాలు వేసి బాగా కాలిపి ఒక టిఫిన్ బాక్స్‌లో పోసి మూత పెట్టాలి.  మరో పెద్ద గిన్నెలో అడుగున నీళ్లు పోసి, స్టౌ మీద పెట్టి మరిగించాలి. మరుగుతున్న నీళ్ల మీద టిఫిన్ బాక్స్‌ను పెట్టి, స్టౌ సిమ్ చేయాలి.  పదినిమిషాల సేపు ఉడికిన తర్వాత బయటకు తీయాలి. మూత తీసి ప్లేట్‌లోకి బోర్లించాలి.  మృదువుగా తయారైన పుడ్డింగ్ మీద నచ్చిన గార్నిష్ చేసుకోవాలి.