ఎగ్ శాండ్‌విచ్
 • 374 Views

ఎగ్ శాండ్‌విచ్

కావలసినవి:

 • బ్రౌన్ బ్రెడ్: 6 స్లైసులు;
 •  ఉడకబెట్టిన గుడ్లు: 3;
 •  ఉడకబెట్టిన చికెన్ : (చిదుముకున్నది) 1 కప్పు;
 •  మెయోనేజ్: అరకప్పు;
 • కొత్తిమీర తరుగు : పావు కప్పు;
 •  క్యాప్సికం ముక్కలు: పావు కప్పు;
 •  పచ్చిమిర్చి తరుగు: 2 టీస్పూన్లు;
 •  చీజ్ తురుము: పావు కప్పు;
 •  సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లి తరుగు: పావు కప్పు;
 •  ఉప్పు,మిరియాల పొడి: తగినంత

విధానం:

ముందుగా చీజ్‌ని, మెయోనేజ్‌ని బాగా కలుపుకోవాలి. దీనికి చిదిమిన గుడ్డు ముక్కలని చేర్చాలి. మిగతా పదార్థాలను ఒక్కొక్కటిగా ఈ మిశ్రమానికి చేర్చి కలపాలి. బ్రెడ్ స్లైసెస్‌కి రెండు వైపులా బటర్ రాసి ఒక వైపు తయారుచేసుకున్న మిశ్రమాన్ని సమంగా పరిచి, దాని మీద సన్నగా ఉల్లిపాయ ముక్కలను పేర్చి, మరో బ్రెడ్ స్లైస్‌ని దీని మీద ఉంచాలి. గ్రిల్ లేదా పెనం వేడి చేసుకొని ఈ శాండ్‌విచ్‌ను చీజ్ కరిగే వరకూ రెండు వైపులా కాల్చాలి. tasty ఎగ్ శాండ్‌విచ్