మైదా, వంటసోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించుకోవాలి. దీనికి మిల్క్‌మెయిడ్, పాలు, వెనీలా ఎసెన్స్, చక్కెర, వైట్ బటర్ కలిపి చిక్కగా చేసుకోవాలి (కేకు మిశ్రమంలా కల్లుపుకోవాలి) . ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్‌ను ముందుగానే 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఉంచాలి. ఆ తరువాత ముందు కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి.. ఓవెన్లో ఉంచి 20 నిమిషాలపాటు బేక్ చేసి తీసేయాలి. అంతే ఎగ్‌లెస్ వెనీలా కేక్ రెడీ..!