ఎగ్‌లెస్ వెనీలా కేక్
  • 530 Views

ఎగ్‌లెస్ వెనీలా కేక్

కావలసినవి:

  • మిల్క్‌మెయిడ్.. 400 గ్రా.
  • పాలు.. 300 ఎం.ఎల్.
  • వైట్ బటర్.. 180 గ్రా.
  • చక్కెర.. 15 గ్రా.
  • మైదా.. 150 గ్రా.
  • వంటసోడా.. 5 గ్రా.
  • బేకింగ్ పౌడర్.. 10 గ్రా.
  • వెనీలా ఎసెన్స్.. 10 ఎం.ఎల్.

విధానం:

దా, వంటసోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించుకోవాలి. దీనికి మిల్క్‌మెయిడ్, పాలు, వెనీలా ఎసెన్స్, చక్కెర, వైట్ బటర్ కలిపి చిక్కగా చేసుకోవాలి. ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్‌ను ముందుగానే 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఉంచాలి. ఆ తరువాత ముందు కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి.. ఓవెన్‌లో ఉంచి 20 నిమిషాలపాటు బేక్ చేసి తీసేయాలి. అంతే ఎగ్‌లెస్ వెనీలా కేక్ రెడీ..!