వంకాయ పచ్చడి
  • 474 Views

వంకాయ పచ్చడి

కావలసినవి:

  • వంకాయలు - అర కిలో
  • పచ్చి మిరపకాయలు - 50 గ్రాములు
  • చింతపండు - నిమ్మకాయంత
  • అల్లం - అంగుళం ముక్క
  • జీలకర్ర - టీ స్పూను
  • వెల్లుల్లి - 4 రెబ్బలు
  • ఉప్పు - సరిపడా
  • నూనె - 100 గ్రాములు
  • పోపు సామాను, కరివేపాకు

విధానం:

 వంకాయ ముక్కలను కోసి ఉప్పు నీళ్లలో వేయాలి. బాండీలో కొంచెం నూనె వేసి వంకాయ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో పచ్చిమిరపకాయల్ని కూడా వేయించుకోవచ్చు. పచ్చి మిరపకాయల్ని వేయించే ముందు కొద్దిగా గాటు పెట్టి వేయిస్తే ఎగిరి మొహాన పడవు. పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి, అల్లం అన్నింటినీ రోట్లో వేసి నూరుకొని చివరలో వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి నూరుకోవాలి. పోపులో కరివేపాకు వేసి దీనిలో కలుపుకుంటే సరి. ఇష్టమైనవారు ఇందులో పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని కూడా కలిపితే బావుంటుంది.