వంకాయ రసం
  • 180 Views

వంకాయ రసం

కావలసినవి:

  • వంకాయలు.. 100 గ్రా.
  • మిరియాల పొడి.. ఒక టీ.
  • జీలకర్ర పొడి.. ఒక టీ.
  • ఎండు మిర్చి పొడి.. రెండు టీ.
  • టొమోటో.. ఒకటి
  • చింతపండు.. గినంత
  • ఇంగువ పొడి.. చిటికెడు
  • పసుపు పొడి.. చిటికెడు
  • నీళ్ళు .... 1 కప్పు

విధానం:

లేత వంకాయలను తీసుకుని నూనెలో వేయించాలి. వేయించిన తర్వాత అందులోనే మిరియాలపొడి, జీలకర్ర, పసుపు, ఇంగువ పొడులను చేర్చాలి. దానికి 1 కప్పు చింతపండు రసాన్ని కలిపి, ఉప్పు కావలసినంత చేర్చి ఉడికించాలి.

చింతపండు రసం వద్దనుకునేవారు టొమోటో రసాన్ని చేర్చుకోవచ్చు. కాసేపటికి కొత్తిమీర తరుగుల్ని చేర్చి ఆ తరువాత చారును దించేయాలి. అంతే వంకాయ రసం రెడీ. ఇది వేడి వేడి అన్నంలో సూపర్బ్‌గా ఉంటుంది.