నింపుడు వంకాయ
 • 367 Views

నింపుడు వంకాయ

కావలసినవి :

 • వంకాయలు - పావుకిలో,
 • ఉల్లిపాయలు - 2
 • నువ్వుల పొడి - 1 టేబుల్‌ స్పూన్‌,
 • కొబ్బరి పొడి - 1 టేబుల్‌ స్పూన్‌
 • పల్లీ పొడి - 1 టేబుల్‌ స్పూన్‌
 • , ధనియాల పొడి - 1 టేబుల్‌ స్పూన్‌
 • చింతపండు గుజ్జు - 2 టేబుల్‌ స్పూన్లు,
 • ఉప్పు - తగినంత
 • కారం - తగినంత,
 • నూనె - 5 టేబుల్‌ స్పూన్లు

విధానం:

ఒక స్పూన్‌ నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేయించి మిక్సీ పట్టుకోవాలి. అందులో చింతపండు గుజ్జు, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, పల్లీ పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేయాలి. అన్నీ కలిపి పేస్ట్‌ చేయాలి. వంకాయలు నాలుగు ముక్కలు కోసి ఈ మిశ్రమాన్ని అందులో కూరాలి. వీటిని నూనెలో బాగా వేయించాలి. తర్వాత మిగిలిన పేస్ట్‌ అందులో వేసి పచ్చి వాసన పోయేలా వేయించితే చాలు. నింపుడు వంకాయ రెడీ.