వంకాయ పెరుగుపచ్చడి
  • 332 Views

వంకాయ పెరుగుపచ్చడి

కావలసినవి:

  • పెద్దవంకాయలు-2,
  • పచ్చి మిరపకాయలు-2,
  • ఎండు మిరపకాయలు-2,
  • కొబ్బరి తురుము-2 చెంచాలు,
  • ఆవాలు- అర చెంచా,
  • ఇంగువ- అర చెంచా,
  • నూనె-2 చెంచాలు,
  • పెరుగు- 2 కప్పులు,
  • ఉప్పు తగినంత

విధానం:

వంకాయలకు నూనెరాసి సన్నని మంటపై కాల్చుకోవాలి. చల్లారాక తొక్కతీసి ముద్దగా చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొబ్బరి తురుము కలిపి రుబబుకోవాలి. దీన్ని వంకాయ గుజ్జు, ఉప్పు, పెరుగుతో కలుపుకోవాలి. ఆవాలు, ఇంగువ మిరప కాయలతో పోపు చేసి ఈ ముద్దకి చేర్చాలి. అంతే రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి రెడీ.