అంజీర, ఖర్జూర బర్ఫీ
  • 328 Views

అంజీర, ఖర్జూర బర్ఫీ

కావలసినవి:

  • అంజీరా: 11/2 కప్పులు
  • గింజ తీసిన ఖర్జూరాలు లేదా సీడ్‌లెస్‌ ఖర్జూరాలు: 11/2 కప్పులు
  • బాదం పప్పులు : 25-30
  • జీడిపప్పు : 15-20
  • పిస్తాలు : 15-20
  • నెయ్యి : 1/2 కప్పు
  • సిల్వర్‌ ఫాయిల్‌: 1-2 షీట్లు

విధానం:

ముందుగా అంజీరాలను రెండు కప్పుల నీళ్ళలో మూడు నుంచి నాలుగు గంటలపాటు నానపెట్టాలి. తరువాత వాటిని వడకట్టి అవసరమైతే నీళ్ళు పోసి గుజ్జులా తయారు చేయాలి. మరికొన్ని అంజీరాలను ఒక కప్పు వేడినీటిలో రెండు మూడు నిమిషాలు ఉండనిచ్చి బయటకి తీసి చల్లబడనివ్వాలి. అవసరమైతే కాసిన నీళ్ళు పోసి దాన్ని కూడా గుజ్జులా తయారు చేసుకోవాలి. సీడ్‌లెస్‌ ఖర్జూరాలను తీసుకుని సన్నని ముక్కలుగా తరుక్కుని అరకప్పు వేడి నీటిలో పావుగంట నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత వాటిని కూడా బయటకు తీసుకుని గుజ్జులా తయారు చేసుకోవాలి. దీనితో పాటు కొన్ని ఖర్జూరాలు తీసుకొని ముపె్పై సెకెన్ల పాటు ఒవెన్‌లో ఉడికించి దానిని కూడా అవసరమైతే నీళ్ళు పోసి గుజ్జుగా చేసుకోవాలి.

బాదం, పిస్తా, జీడిపప్పులను చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తర్వాత నేతిని మందబాపాటి గిన్నె లేదా బాణలిలో వేడి చేసి దానిలో ఈ అంజీర, ఖర్జూరాల గుజ్జును పోయాలి. మీడియం మంట మీద పది నుంచి పావు గంటసేపు అందులోని నీరంతా ఇంకిపోయే దాకా ఉడికించాలి. ఈ మిశ్రమం ఉండలు చుట్టుకోకుండా తిప్పుతూ ఉండాలి. తర్వాత అందులో తరిగి పెట్టుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు ముక్కలను వేసి కలిసేలా తిప్పాలి. ఉండకట్టకుండా తిప్పుతూ మరో పావుగంట సేపు ఉడికించి అది పక్కలకు అంటుకోవడం మానేసినప్పుడు దించి ఒక ట్రేకి నెయ్యి రాసి అందులో పోయాలి. దానిపై సిల్వర్‌ ఫాయిల్‌ కప్పాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా చేసి తినడమే.