ఫిష్ అమృత్‌సరి
 • 427 Views

ఫిష్ అమృత్‌సరి

కావలసినవి:

 • చేప ముక్కలు - 500 గ్రా
 • సన్నగా తరిగిన అల్లం ముక్కలు - 20 గ్రా
 • తరిగిన పచ్చిమిర్చి - 20 గ్రా, కోడిగుడ్లు - రెండు
 • నూనె - అర కప్పు, మిరప్పొడి - 50 గ్రా
 • పసుపు - 10 గ్రా, ఆవనూనె - 10 గ్రా
 • శనగపిండి - 100 గ్రా, వాము - 15 గ్రా
 • అల్లంవెల్లుల్లి పేస్టు - 25 గ్రా
 • నిమ్మకాయ - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి
 • కొత్తిమీర - కట్ట, ధనియాల పొడి - 20 గ్రా
 • గరం మసాలా పౌడర్ - 20 గ్రా
 • జీలకర్ర పొడి - 20 గ్రా

విధానం:

ముందుగా చేపముక్కలను శుభ్రపరిచి అందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలిపి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి, అల్లం ముక్కలు, కోడిగుడ్డు సొన, ఆవనూనె, మిరప్పొడి, పసుపు, ఉప్పు, వాము, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి తగినంత నీటితో మిశ్రమాన్ని కొంచెం జారుడుగా (మిశ్రమం చేప ముక్కలకు పట్టేటట్లు) చేసుకోవాలి. ఈ మిశ్రమంలో చేపముక్కలను వేసి కలిపి పక్కన ఉంచాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేడి చేసి అందులో చేప ముక్కలను డీప్ ఫ్రై చేయాలి. బాగా వేగిన చేపముక్కలను నూనెలో నుంచి తీసి ప్లేట్‌లో సర్ది వాటి మీద ఉల్లిపాయముక్కలు, కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలను గార్నిష్ చేస్తే ఫిష్ అమృత్‌సరి రెడీ.