చేపల పచ్చడి
 • 684 Views

చేపల పచ్చడి

కావలసినవి:

 • చేపముక్కలు - అరకిలో,
 • వెల్లుల్లి - ఒకటి (నూరుకోవాలి),
 • కారం - అరకప్పు
 • ఉప్పు - గరిటెడు,
 • జిలకర, మెంతులు వేయించిన పొడి - ఒక చెంచా
 • లవంగాలు - 2,
 • యాలకులు - 1,
 • దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
 • (మసాలా దినుసులు పొడిగొట్టుకోవాలి),
 • నూనె - అరకిలో,
 • నిమ్మకాయ - ఒకటి

విధానం:

చేపముక్కలు కడిగి చిన్న ముక్కలుగా కొయ్యాలి. నీరు కాస్త ఇంకిపోయేలా ఆరనివ్వండి. మూకుడులో నూనె పోసి కాగిన తరువాత ఈ ముక్కల్ని వేయించాలి. మరీ వేగితే ముక్కలు పొడిపొడిగా తునిగి పోతాయి. ముక్క ఉడికితే సరిపోతుంది. మూకుడులో ఎక్కువగా ఉన్న నూనె తీసేసి అందులో కారం, ఉప్పు, వెల్లుల్లి ముద్ద, మసాలా పొడులు వేసుకోవాలి. చల్లారిన తరువాత నిమ్మకాయ రసం పిండి సీసాలోకి తీసుకోవాలి.