పాలు సగం అయ్యేదాకా బాగా మరిగించాలి. ఇంతలో బియ్యాన్ని దోరగా వేయించి, చల్లారాక యాలకులతో కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పిండి, పంచదారను మరిగిన పాలల్లో వేసి బాగా కలిపితే చిక్కగా అవుతుంది. ఒక నిమిషం తర్వాత పొయ్యి మీద నుండి దింపేయాలి. ఇది చల్లారేలోగా పండ్లను సన్నగా ముక్కలుగా తరిగి, పాల మిశ్రమంలో చేర్చాలి. చివరిగా మిగిలిన పదార్ధాలన్నీ కలిపి ఓ రెండు గంటలు ఫ్రిజ్ లో ఉంచితే సరిపోతుంది. నోరూరించే సలాడ్ సిద్ధం అయినట్లే.