ఫ్రూట్‌ బిస్కెట్లు
  • 537 Views

ఫ్రూట్‌ బిస్కెట్లు

కావలసినవి:

  • మైదా - అరకిలో,
  • గుడ్లు - 6
  • పంచదార - పావుకిలో,
  • నూనె - వేయించడానికి సరిపడా
  • పుచ్చకాయ - 1,
  • కమలా రసం - 1 కప్పు
  • బేకింగ్‌ పౌడర్‌ - 1 స్పూన్‌

విధానం:

పుచ్చకాయ రసం తీసిపెట్టుకోవాలి. పంచదార పొడి చేసుకోవాలి. జల్లించిన మైదాపిండిలో బేకింగ్‌ పౌడర్‌, పంచదార పొడి వేసి కలపాలి. అందులో కోడిగుడ్ల సొన, పుచ్చరసం, కమలారసం వేసి ముద్దలా కలపాలి. వీటితోనే పిండి ముద్దవుతుంది. అవసరమైతే నీళ్లు పోసుకోవచ్చు. దీన్ని పెద్ద పెద్ద ఉండలు చేసుకుని చపాతీ కంటే కొద్దిగా మందంగా వత్తుకోవాలి. వీటిని ఇష్టమైన ఆకారంలో కత్తిరించుకుని కాగిన నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. కరకరలాడే రుచికరమైన బిస్కెట్లు రెడీ.