ఫ్రూట్‌ ఐస్‌క్రీమ్‌
 • 400 Views

ఫ్రూట్‌ ఐస్‌క్రీమ్‌

కావలసినవి:

 • ఐస్‌క్రీమ్‌ పౌడర్‌ - 1 పాకెట్‌
 • పాలు - 1 కప్పు
 • నీళ్లు - 4 కప్పులు
 • పంచదార - 1 కప్పు
 • జీడిపప్పు - పావుకప్పు
 • యాలకులు - 10
 • అరటిపండు - 1
 • యాపిల్‌ - 1
 • జామపండు - 1
 • పైనాపిల్‌ - సగం

విధానం:

ఐస్‌క్రీమ్‌ పౌడర్‌ను పాలలో కలిపి పేస్టులా తయారు చేయాలి. నీళ్లను బాగా తెర్లేవరకు మరగబెట్టాలి. ఐస్‌క్రీమ్‌ పౌడర్‌ కలిపిన పాలను అందులో వేసి బాగా కలియబెడుతూ వుండాలి. బాగా చిక్కగా అయిన తర్వాత పంచదార, యాలకుల పొడి, ముక్కలు చేసిన జీడిపప్పు వేసి చిక్కగా వుడకనివ్వాలి. తర్వాత దించి చల్లార్చి డీప్‌ఫ్రిజ్‌లో పెట్టాలి. కొంచెం గట్టిగా అయిన తర్వాత మజ్జిగ కవ్వంతోగానీ ఎగ్‌ బీటర్‌తో కానీ చిలికితే ముద్ద అవుతుంది. అన్ని రకాల పండ్ల ముక్కలు సన్నగా తరిగి ఐస్‌క్రీమ్‌పైన వేసి సర్వ్‌ చేయాలి.