ఫ్రూట్‌ ఖీర్‌
  • 308 Views

ఫ్రూట్‌ ఖీర్‌

కావలసినవి:

  • పాలు - 1 లీటరు,
  • కండెన్స్‌డ్‌ మిల్క్‌ - అరకప్పు
  • మామిడిపండు - 1,
  • యాపిల్‌ - 1
  • అరటిపండు - 1,
  • దానిమ్మ గింజలు - అరకప్పు
  • కుంకుమ పువ్వు రేకలు - అరస్పూన్‌
  • యాలకుల పొడి - 1 స్పూన్‌
  •  జీడిపప్పు, బాదంపప్పు - కొద్దిగా,
  • పంచదార - 2 కప్పులు

విధానం:

బాదం, జీడిపప్పులను గోరువెచ్చటి నీళ్లలో నానబెట్టాలి. వాటిలో సగం తీసుకుని కొద్దిగా పాలు కలిపి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. మందపాటి పాత్రలో పాలు మరగబెట్టాలి. అందులోనే కండెన్స్‌డ్‌ మిల్క్‌, పంచదార వేసి సన్నమంట మీద ఉడికించాలి. ఐదు నిముషాల తర్వాత బాదం, జీడిపప్పు పేస్ట్‌ కలపాలి. అందులోనే మామిడిపండు రసం, యాపిల్‌, అరటి పండు ముక్కలు, దానిమ్మ గింజలు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు రేకలు, మిగిలిన బాదం, జీడిపప్పు కలిపి దించేయాలి. అంతే కమ్మని డ్రై ఫ్రూట్స్‌ ఖీర్‌ రెడీ.