ఆలూ ఫ్రూట్‌ బాల్స్‌
  • 419 Views

ఆలూ ఫ్రూట్‌ బాల్స్‌

కావలసినవి:

  • ఉడికించిన బంగాళదుంప ముద్ద - 2 కప్పులు,
  • ఖర్జూర పండ్లు - 20
  • జీడిపప్పు - 20, కిస్‌మిస్‌ - 20
  • సారపప్పు - 1 స్పూను, నెయ్యి - తగినంత
  • పంచదార పొడి - 3 స్పూన్లు
  • యాలకుల పొడి - 1 స్పూను
  • ఎండుకొబ్బరి పొడి - అర కప్పు

విధానం:

ఉడికించిన బంగాళదుంప ముద్దని నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు, కిస్‌మిస్‌, సారపప్పు కూడా నేతిలో వేయించాలి. వీటిని వేయించిన బంగాళదుంప ముద్దలో కలపాలి. ఈ మిశ్రమంలో పంచదార, యాలకుల పొడి కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. వీటిని కొబ్బరి పొడిలో దొర్లించాలి. అంతే ఆలూ ఫ్రూట్‌ బాల్స్‌ రెడీ.