ఫ్రూట్ - వెజ్ రైతా
 • 399 Views

ఫ్రూట్ - వెజ్ రైతా

కావలసినవి:

 • చిలికినతాజా పెరుగు - ఒకటిన్నర కప్పులు
 • కీర - ఒకటి,
 • క్యారట్ - ఒకటి (మీడియం సైజు)
 • ఉల్లిపాయ - ఒకటి,
 • టొమాటో - ఒకటి
 • దానిమ్మ గింజలు - పావు కప్పు
 • ద్రాక్ష - పావు కప్పు,
 • ఆపిల్ - సగంకాయ
 • మిరియాల పొడి - అర టీ స్పూన్
 • బూందీ - పావు కప్పు,
 • కొత్తిమీర - చిన్న కట్ట

విధానం:

కీర, క్యారట్, ఉల్లిపాయ, టొమాటోలను తరగాలి. వీటిని మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. పెరుగులో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని, ద్రాక్ష, దానిమ్మగింజలు, ఆపిల్ ముక్కలు, మిరియాలపొడి, బూందీ కలిపి సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఇందులో పండ్లను వేస్తున్నాం కాబట్టి ఉప్పు వేయకూడదు. ఇష్టమైతే డ్రైఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు. ఇది చపాతీ, పుల్కాల్లోకి బాగుంటుంది. చపాతీల్లో కర్రీ తినని పిల్లలు ఈ రైతాను ఇష్టపడతారు.