ముందుగా పండ్లన్నింటినీ శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఓ పెద్ద బౌల్లో తీసుకోవాలి. వీటి మీద మిరియాల పొడి, ఉప్పువేసి నిమ్మరసం పిండి పైన తేనె వేసి మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచితే ఫ్రూట్ సలాడ్ రెడీ. మూడు గంటల తర్వాత సలాడ్‌ను ఐస్‌క్రీమ్‌తో కలిపి సర్వ్ చేయండి.