ఉల్లిపాయలను సన్నని చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బాణలిలో నాలుగు టీ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో ముందుగా నువ్వులు, పల్లీలు వేసి వేయించుకోవాలి. తరవాత ఉల్లిముక్కలను వేసి వేయించాలి. ఇది తయారుచేసేటప్పుడు మూత పెట్టకూడదు. ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు... ఈ మూడింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉల్లిపాయలు బాగా వేగిన తరవాత అందులో వేసి బాగా కలిపి దించేయాలి. అన్నంలోకి ఇది చాలా రుచిగా ఉంటుంది.