పండుగప్ప ఫ్రై
 • 1640 Views

పండుగప్ప ఫ్రై

కావలసినవి:

 • పండుగప్ప ఫ్రై
 • పండుగప్ప చేపను శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకోవాలి. వీటిలో అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి.
 • పండుగప్ప చేపలు - కేజీ
 • ఉల్లిపాయలు - 2 పెద్దవి
 • పచ్చిమిర్చి - 5 (మధ్యకు చీల్చుకోవాలి)
 • అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూన్‌
 • కారం - 2 టేబుల్‌ స్పూన్లు
 • పసుపు - చిటికెడు
 • ఉప్పు - సరిపడా
 • నూనె - తగినంత
 • కొత్తిమీర తురుము - 2 టేబుల్‌ స్పూన్లు

విధానం:

పండుగప్ప చేపను శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకోవాలి. వీటిలో అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఓ గంట అలాగే ఉంచాలి. ఇలా మాగేట్‌ చేసి పెట్టుకున్న చేపముక్కల్ని వేయించే ముందు ఒకసారి మళ్లీ కలుపుకోవాలి. పొయ్యి వెలిగించి చిన్న మూకుడు పెట్టి రెండు ముక్కలు వేగడానికి సరిపడా నూనె పోసుకుని వేడి చెయ్యాలి. రెండు ముక్కల చొప్పున వేపి పక్కన పెట్టుకోవాలి. అదే మూకుడులోనే ఉల్లిపాయలు వేగడానికి అవసరమైన నూనె మాత్రమే ఉంచి మిగిలింది తీసివేయాలి. అందులో ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి. ఉల్లిపాయ ముక్కలకు పట్టడానికి అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేయాలి. కొత్తిమీర తురుము, ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకొని ఆఖరులో వేపి పెట్టుకున్న ముక్కల్ని వేసి గరిటెతో ముక్క చితకకుండా తిప్పుకోవాలి. అంతే పండుగప్ప ఫ్రై రెడీ. చాలా రుచిగా ఉంటుంది.