వెల్లుల్లి అల్లం పచ్చడి
  • 203 Views

వెల్లుల్లి అల్లం పచ్చడి

కావలసినవి:

  • వెల్లుల్లిరేకులు... మూడు కప్పులు
  • అల్లం పేస్ట్.... అరకప్పు
  • కారం... ఒక కప్పు
  • ఉప్పు... సరిపడ
  • మెంతిపొడి... పావు కప్పు
  • జీలకర్ర... ఒక టీ స్పూన్
  • ఆవపిండి... అర కప్పు.
  • ఇంగువ... అర టీ స్పూను.
  • నిమ్మరసం...ఒక కప్పు
  • నువ్వులనూనె... రెండు కప్పులు.
  • పసుపు.. అరటీస్పూన్

విధానం:

ముందుగా వెల్లుల్లి రేకుల్ని, అల్లం ముక్కల్ని పొట్టుతీసి శుభ్రం చేసుకోవాలి. ఓ బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, ఇంగువ, మెంతిపొడి, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి రేకులు, అల్లం పేస్ట్‌ను వేసి బాగా దోరగా వేయించాలి. వెల్లుల్లి రెబ్బలు బాగా వేగాక నిమ్మరసం వేసి బాగా కలిపాలి. తరువాత మిగిలిన నువ్వుల నూనెను వేడిచేసి పచ్చడిమీద పోయాలి. ఈ పచ్చడిని పొడిగా ఉన్న ఓ గాజు పాత్రలోకి నిల్వ ఉంచుకుంటే మూడునెలలపాటు అలాగే ఉంటుంది.