గార్లిక్ చికెన్ పులావ్‌
 • 268 Views

గార్లిక్ చికెన్ పులావ్‌

కావలసినవి:

 • చికెన్... అరకేజీ
 • బియ్యం... రెండు కప్పులు
 • వెల్లుల్లి... పొట్టు తీసినవి వంద గ్రా.
 • ఉల్లిపాయ... ఒకటి
 • అల్లం... చిన్న ముక్క
 • షాజీరా... అర టీ.
 • ధనియాలు... ఒక టీ
 • మిరియాలు... అర టీ.
 • లవంగాలు... నాలుగు
 • యాలకులు... రెండు
 • దాల్చిన చెక్క... కొద్దిగా
 • పులావు ఆకులు... రెండు
 • ఉప్పు... తగినంత


అలంకరణ కోసం :

 • ఉల్లిపాయ... ఒకటి
 • లవంగాలు... మూడు
 • పులావు ఆకులు... రెండు
 • యాలకులు... రెండు
 • షాజీరా... పావు టీస్పూను
 • దాల్చినచెక్క... ఒకటి
 • నెయ్యి లేదా నూనె... రెండు టీ.

విధానం:

ప్రెషర్‌ పాన్‌లో కడిగిన చికెన్ ముక్కలు, బిర్యానీ మసాలాలు, ఉప్పు, నాలుగు కప్పుల నీళ్లు వేసి ఉడికించాలి. సుమారు రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి దించి చికెన్ ముక్కల్ని విడిగా తీసి ఆరబెట్టాలి. మసాలాల్ని కూడా తీసి మెత్తగా మెదపాలి. చికెన్‌లోంచి వచ్చిన నీళ్లను పక్కన ఉంచాలి.

ఇప్పుడు ప్రెషర్‌ కుక్కర్‌లో నెయ్యి లేదా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరవాత అలంకరణకు అవసరమయ్యే మసాలాలు, మాంసం... అన్నీ వేసి కొద్దిసేపు వేయించాలి. తరవాత పక్కకు తీసి ఉంచిన మాంసం నీళ్లు పోసి మరిగాక.. కడిగి ఉంచిన బియ్యం వేసి ఉడికించాలి. దీన్ని వేడివేడిగా కుర్మా కూర లేదా పెరుగుచట్నీతో సర్వ్ చేయాలి.