చింతపండులో వేడినీళ్లు పోసి, అరగంట నానబెట్టాలి. గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి, టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక 50 గ్రా.ల వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. అందులోనే అర టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించి, దించాలి. చల్లారిన తర్వాత పేస్ట్ చేయాలి. అదే గిన్నెలో మిగతా నూనె వేసి, సోంపు, మెంతులు వేయించాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మరో ఐదు నిమిషాలు వేయించి, పసుపు, కారం, తరిగిన టొమాటోలు కలిపి ఉడికించాలి. వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి పేస్ట్ వేసి, వేయించాక చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. వెల్లుల్లి బాగా ఉడికి, మిశ్రమం చిక్కబడినాక మంట తీసేయాలి. కొత్తిమీర చల్లి, సర్వ్ చేయాలి. ఈ కర్రీ చపాతీ, పూరీలోకి బాగుంటుంది.