అల్లం, మిర్చి పెసరట్టు
  • 499 Views

అల్లం, మిర్చి పెసరట్టు

కావలసినవి:

  • పెసరపప్పు... అరకేజీ
  • అల్లం... ఒక అంగుళం ముక్క
  • పచ్చిమిర్చి... మూడు
  • ఉల్లిముక్కలు.. రెండు కప్పులు
  • జీలకర్ర... ఒక టీ.
  • మెత్తని ఉప్పు... అర టీ.
  • కొత్తిమీర తరుగు... మూడు టీ.

విధానం:

ముందుగా పెసరపప్పును నానబెట్టుకుని పిండి రుబ్బుకోవాలి. పిండిని గట్టిగా రుబ్బుకుంటే మంచిది. ఒక బౌల్‌లో ఉల్లిముక్కలు, అల్లం, మిర్చిముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుతూ పది నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి.  పెనం వేడిచేసి ఒక గరిటెడు పెసరట్టు పిండిని దోసెలా వేసి, దానిపై ఉల్లిమిశ్రమాన్ని పరచాలి. అట్ల కాడతో మూడు చెంచాల నూనె అట్టు మొత్తం కలిసేలా అదుముతూ, ఎర్రగా కాల్చాలి. అంతే పెసరట్టు రెడీ. అయితే అట్టు కాలిన తరువాత జాగ్రత్తగా ప్లేటులోకి తీసుకోవాలి.