గోబీ మంచూరియా
  • 615 Views

గోబీ మంచూరియా

కావలసినవి:

  • క్యాలీఫ్లవర్‌ గుత్తులు (పువ్వులు) - 1 కప్పు,
  • మైదాపిండి - అరకప్పు
  • మొక్కజొన్న పిండి - అరకప్పు,
  • గుడ్డు - 1, మిరియాల పొడి- 1 స్పూన్‌
  • అజినమోటో - చిటికెడు,
  • ఫుడ్‌ కలర్‌ - చిటికెడు,
  • ఉప్పు - తగినంత
  • వెల్లుల్లి ముక్కలు - 1 స్పూన్‌,
  • కరివేపాకు - 3 రెమ్మలు, ఉల్లికాడలు - 4
  • నూనె - వేయించడానికి సరిపడా

విధానం:

క్యాలీఫ్లవర్‌ పువ్వులను వేడి నీళ్లలో ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. మొక్కజొన్న పిండి, మైదాపిండి, గుడ్డు, మిరియాలపొడి, ఉప్పు, ఫుడ్‌ కలర్‌, అజినమోటో అన్నీ ఒక పాత్రలో వేసి కలపాలి. క్యాలీఫ్లవర్‌ ముక్కలను ఆ మిశ్రమంలో వేసి కలపాలి. వీటిని కాగిన నూనెలో వేయించుకోవాలి. మరొక బాండీలో రెండు స్పూన్లు నూనె వేడి చేయాలి. వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, వేయించాలి. అందులో వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్‌ ముక్కల్ని వేసి కలపాలి. పొడి పొడిగా ఉండాలనుకునేవారు అలాగే తినొచ్చు. ముక్కలు కొంచెం మెత్తగా ఉండాలంటే సోయాసాస్‌ కలపాలి.