గోదావరి చికెన్‌ కర్రీ
  • 512 Views

గోదావరి చికెన్‌ కర్రీ

కావలసినవి:

  • చికెన్‌ - పావుకేజీ
  • బోన్‌లెస్‌ చికెన్‌ - పావుకేజీ
  • ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 4
  • అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 టీ స్పూన్లు
  • కారం - 1 1/2 టీ స్పూను
  • పెరుగు - 1 కప్పు
  • టమాటా గుజ్జు - అరకప్పు
  • ఉప్పు - తగినంత
  • ధనియాల పొడి - 1/2 టీ స్పూను
  • జీలకర్ర పొడి - 1/2 టీ స్పూను,
  • గరం మసాలా - 1/2 టీ స్పూను
  • గసగసాల పేస్టు - 1 టీ స్పూను,
  • జీడిపప్పు పేస్టు - 2 టీ స్పూన్లు
  • కొత్తిమీర - 1 చిన్నకట్ట,
  • నూనె - 2 టేబుల్‌ స్పూన్లు

విధానం:

బోన్‌లెస్‌ చికెన్‌ని ఖైమా కొట్టించుకోవాలి. మామూలు చికెన్‌ని కడిగి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు కలిపి నాననివ్వాలి. గిన్నెలో నూనె కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించాలి. చికెన్‌ ముక్కల్ని కూడా అందులో వేయాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలియదిప్పి ఉడికించాలి. కొద్దిగా ఉడికాక ఖైమా, టమాటా గుజ్జు, జీలకర్ర పొడి, గరం మసాలా కలిపి పావుగంట ఉడికించాలి. దించేముందు గసగసాల పేస్టు, జీడిపప్పు పేస్టు, కొత్తిమీర చల్లుకోవాలి.అంతే రుచిరకమైన గోదావరి చికెన్‌ కర్రీ  రెడీ .