పెనం మీద నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు-జీలకర్ర, సోంపు, అల్లం వెల్లుల్లి, ఇంగువ వేసి కలపాలి. గోంగూర వేసి ఉడికాక, చిదిపిన బంగాళదుంప మిశ్రమం, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు, గరం మసాలా, కొబ్బరి పొడి వేసి కలిపి, ఉడికించాలి. మైదా పిండిని పూరీ పిండిలా కలుపుకోవాలి. చిన్న చిన్న ముద్దలు చేసి, పూరీని ఒత్తాలి. దీంట్లో ఉడికించిన గోంగూర, బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి, కజ్జికాయ షేప్లో వచ్చేలా చేసి, చివరలు మూసివేయాలి. ఇలా తయారుచేసుకున్న వాటిని, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా వేయించుకోవాలి. ఈ పకోడాలను వేడి వేడిగా వడ్డించాలి.