గోంగూర పనీర్
 • 465 Views

గోంగూర పనీర్

కావలసినవి:

 • గోంగూర- ఆరు కట్టలు
 • పనీర్-100 గ్రా.
 • ఉల్లిపాయ ముక్కలు- కప్పు
 • పచ్చిమిర్చి- ఆరు
 • లవంగాలు- ఆరు
 • ఏలకులు- ఆరు
 • దాల్చిన చెక్క- చిన్నముక్క
 • అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూన్
 • కరివేపాకు- రెండు రెమ్మలు
 • జీలకర్ర- టీ స్పూన్
 • పసుపు- అర టీ స్పూన్
 • ఉప్పు- తగినంత
 • నూనె- ఆరు టీ స్పూన్లు
 • నెయ్యి- రెండు టీ స్పూన్లు
 • కారం- టీ స్పూన్
 • జీడిపప్పు- పది

విధానం:

గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లుపోసి కాస్త వేడెక్కిన తర్వాత పనీర్ వేసి అయిదారు నిమిషాల తర్వాత తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పాన్‌లో కొన్ని నీళ్లుపోసి గోంగూరను ఉడకపెట్టుకోవాలి. బాణలిలో నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, జీడిపప్పు వేసి ఎరుపురంగు వచ్చేంత వరకు వేయించి చల్లారిన తర్వాత వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోంగూరను కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. బాణలిలో నూనె వేసి వేడెక్కిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముద్ద, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి అందులో గోంగూర పేస్ట్, పనీర్ ముక్కలు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి రెండు కప్పుల నీళ్లుపోసి తక్కువ సెగమీద మగ్గనిచ్చి దించేయాలి. గోంగూర పనీర్‌ను రోటీలతో తింటే రుచిగా ఉంటుంది.