గోంగూర రొయ్యల కూర
  • 501 Views

గోంగూర రొయ్యల కూర

కావలసినవి:

  • గోంగూర - కప్పు,
  • రొయ్యలు - పావుకప్పు,
  • నెయ్యి - నాలుగు చెంచాలు,
  • టమాటాలు - మూడు,
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - చెంచా,
  • ఉల్లిపాయలు - రెండు,
  • పచ్చిమిర్చి, ఎండుమిర్చి - నాలుగు,
  • తాలింపుదినుసులు - అన్నీ కలిపి కొద్దిగా,
  • ధనియాలపొడి - అరచెంచా,
  • పసుపు - అరచెంచా,
  • కారం - రెండు చెంచాలు,
  • ఉప్పు - రుచికి తగినంత,
  • కరివేపాకు, కొత్తిమీర - గార్నిషింగ్ కోసం.

విధానం:

గోంగూరను బాగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. పాన్‌లో నెయ్యి, శుభ్రం చేసిన రొయ్యల్ని వేసి బాగా వేయించాలి. ఈ వేయించిన రొయ్యల్ని నెయ్యి లేకుండా విడిగా తీసిపెట్టుకోవాలి. ఈ మిగిలిన నెయ్యిలో ఎండుమిర్చి, తాలింపుదినుసులు ఉల్లిపాయముక్కలు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి మిశ్రమం ఆ తరువాత టమాటా ముక్కలు చేర్చాలి. ఆ తరువాత ఉడికించి పెట్టుకున్న గోంగూర, కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి మూతపెట్టాలి. మరికాసేపయ్యాక ధనియాలపొడి, వేయించిన రొయ్యల్ని చేర్చాలి. ఐదారునిమిషాలయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే సరిపోతుంది. అంతే ఎంతో రుచికరమైన గోంగూర రొయ్యల కూర సిద్ధం అయినట్టే.