గోంగూర రైస్
 • 317 Views

గోంగూర రైస్

కావలసినవి:

 • బియ్యం-కప్పు
 • గోంగూర - రెండు కట్టలు
 • ఎండుమిర్చి - 6
 • శనగపప్పు - టీస్పూను
 • మినప్పప్పు - టీస్పూను
 • ఆవాలు - టీస్పూను
 • జీలకరప్రొడి - రెండు టీస్పూనులు
 • ధ నియాలపొడి - రెండు టీస్పూనులు
 • కరివేపాకు - రెండు రెమ్మలు
 • ఉప్పు - తగినంత

విధానం:

ముందుగా గోంగూరను వేయించి మిక్సీ పట్టాలి. బియ్యం కడిగి నీరు పోయాలి. పాన్‌లో నూనె వేసి పోపు వేయించి అందులో గోంగూర ముద్ద వేసి బియ్యాన్ని నీటితో సహా పోయాలి. ఉప్పు వేసి పాన్ మూత పెట్టి విజిల్ పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి. వెడల్పయిన పాత్రలో వేసి జీలకర్ర, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు నంచుకుని తింటే రుచి అదురుతుంది.