గోరుచిక్కుడు కైమా
 • 492 Views

గోరుచిక్కుడు కైమా

కావలసినవి:

 • కైమా - పావుకిలో,
 • గోరుచిక్కుడు (నార తీసి, అంగుళం ముక్కలుగా తరగాలి) - పావుకిలో,
 • అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను,
 • ఉల్లిపాయ తరుగు - 1 కప్పు,
 • కారం - 1 టీ స్పూను,
 • పసుపు - పావు టీ స్పూను,
 • గరం మసాలా - అర టీ స్పూను,
 • ఎండుకొబ్బరి, గసగసాల పేస్టు - 1 టేబుల్ స్పూను,
 • ఉప్పు - రుచికి తగినంత,
 • నూనె - 1 టేబుల్ స్పూను,
 • కొత్తిమీర తరుగు - అరకప్పు.

విధానం:

కైమాలో పసుపు, అల్లం వెల్లుల్లిపేస్టు, కారం, ఉప్పు కలిపి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. గోరుచిక్కుడు తరుగులో తగినంత నీరు పోసి పచ్చివాసన పోయేలా 5 నిమిషాలు మాత్రం ఉడికించి నీరు వార్చేయాలి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ తరుగు వేగించి ఉడికించిన కైమా, గోరుచిక్కుడు తరుగు వేసి అరకప్పు నీరు చేర్చి ఐదునిమిషాల తర్వాత కొబ్బరి గసగసాల పేస్టు వేయాలి. 2 నిమిషాలు అయ్యాక గరంమసాలా, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి దించేయాలి. ఈ కూర పరాటాల్లోకే కాకుండా అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది.