భునాహువా గోష్
 • 462 Views

భునాహువా గోష్

కావలసినవి:

 • మటన్ - కేజీ;
 • పచ్చిమిర్చి - 8 (నిలువుగా కట్ చేయాలి);
 • కరివేపాకు - నాలుగు రెమ్మలు;
 • మిరప్పొడి - 3 టీ స్పూన్లు;
 • ఉప్పు - తగినంత;
 • అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్లు;
 •  పసుపు - అర టీ స్పూన్;
 • షాజీరా - టీ స్పూన్;
 • నిమ్మరసం - రెండు టీ స్పూన్లు;
 • ఉల్లి తరుగు - కప్పు;
 • ధనియాల పొడి - టీ స్పూన్;
 • ఎండుకొబ్బరిపొడి - టీ స్పూన్;
 • నూనె - తగినంత;
 • కొత్తిమీర - చిన్న కట్ట

విధానం:

ప్రెజర్‌పాన్‌లో మటన్, కొద్దిగా నీరు, ఉప్పు వేసి ఉడికించాలి. తర్వాత మటన్‌లో ఉన్న నీటిని తీసేయాలి. ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో షాజీరా, ఉల్లితరుగు, కరివేపాకు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తరవాత పచ్చిమిర్చి, అల్లం- వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. తర్వాత మిరప్పొడి, ఉడికించిన మటన్ వేసి కలపాలి. కొద్దిగా వేగాక ఎండుకొబ్బరి, ధనియాలపొడి వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత దించి నిమ్మరసం కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.