నేతిలో గరం మసాలా వేయించాలి. చిటపటలాడేటప్పుడు ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి. అందులోనే మటన్ ముక్కలు, సొరకాయ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, ధనియాలపొడి కలిపి బాండీలో వేగుతున్న మిశ్రమంలో కలపాలి. రెండు నిమిషాల తర్వాత నానబెట్టిన శనగపప్పు, పెరుగు కలిపి సన్నమంట మీద ఉడికించాలి. చివరిలో నిమ్మరసం కలిపి దింపుకోవాలి.