ఒక గిన్నెలో మైదాపిండి వేసి అందులో వేడి నెయ్యి వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి చపాతీపిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం ఒక కప్పు కోవా, పంచదార, బాదం + జీడిపప్పు పొడులను కలుపుకుని ఉంచుకోవాలి. మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిని చిన్న పూరీలుగా ఒత్తుకోవాలి. మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అంచులు గట్టిగా మడుచుకోవాలి. వీటిని కాగిన నూనెలో దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో పావు కప్పు పంచదార, కొద్దిగా నీరు పోసి తీగపాకం వచ్చే వరకు బాగా కలిపి, వేయించిన గుజియాల మీద పోయాలి. పాకం ఆరాక వీటిని తీసి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.