గులాబ్‌జామ్
  • 2360 Views

గులాబ్‌జామ్

కావలసినవి:

  • మైదా 300 గ్రా.,
  • పచ్చికోవా - కిలో
  • సోడా - పావు టీస్పూను
  • పంచదార - కిలో,
  • నూనె-డీప్‌ఫ్రైకి సరిపడా

విధానం:

ఒకపాత్రలో పచ్చికోవా, మైదా, సోడా వేసి కలపాలి. సుమారు పదినిముషాల పాటు ఈ పిండిని బాగా మర్దనా చేసి పావుగంట సేపు నానబెట్టాలి. తరవాత వీటిని మనకు కావలసిన ఆకారంలో తయారుచేసుకుని పక్కనుంచుకోవాలి. ఒక పాత్రలో పంచదార, నీరు వేసి లేతపాకం పట్టి ఉంచుకోవాలి. సన్నమంట మీద బాణలిలో నూనె (నూనెను మరగనివ్వకూడదు) కాగాక తయారుచేసి ఉంచుకున్న జామూన్‌లను అందులోకి జారవిడవాలి. బయటకు తీసిన తరవాత రెండుమూడు నిముషాలు చల్లారనివ్వాలి. తరవాత వీటిని పాకంలో వేయాలి.